Breaking : టీఎస్‌పీఎస్సీ బోర్డు రద్దు?
ప్రత్నాపత్రాల లీకేజీపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం
ఎన్నికల సమయంలో తలెత్తిన సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కారం చూడాలని నిర్ణయించారు. ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ ప్రత్నాపత్రాల లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఉదయాన్నే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది.
ప్రగతి భవన్ కు...
మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ కూడా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా, విపక్షాలకు ఒక అంశంగా మారడంతో దానికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్న నిర్ణయానికి ప్రభుత్వ అధినేత వచ్చినట్లు సమాచారం. అందుకోసమే ఉదయాన్నే సమావేశాన్ని ముఖ్యమైన మంత్రులతో సమావేశమయ్యారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్నింటిని రద్దు చేసిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.