ఈ నెల 18న ధర్నాకు దిగుతున్నాం

వరి ధాన్యం కొనుగోలు బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

Update: 2021-11-16 14:10 GMT

వరి ధాన్యం కొనుగోలు బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద ప్రమాణాలు పాటిస్తుందని తెలిపారు. పంజాబ్ నుంచి మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ విషయంలో నిరాకరిస్తుందన్నారు. తాము కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదించినా స్పందన కన్పించలేదని కేసీఆర్ తెలిపారు. ఇందుకు నిరసనగా ఈ నెల 18వ తేదీన ఇందిరా పార్కు వద్ద మహా ధార్నా నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

భవిష్యత్ కార్యాచరణను....
యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై రోజుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రానికో విధానాన్ని కేంద్రం అవలంబిస్తుందన్నారు. ఈనెల 18వ తేదీన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా కలసి ధర్నా చేస్తారన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ధర్నా జరుగుతుందని, అనంతరం గవర్నర్ ను కలసి వినతి పత్రం సమర్పిస్తామని, అప్పటికీ స్పందించకపోతే కార్యాచరణను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు.


Tags:    

Similar News