హైఅలెర్ట్... అధికారులకు కేసీఆర్ వార్నింగ్
వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. మొన్నటి కంటే ఎక్కువ వరద వచ్చే అవకాశాలున్నాయని కేసీఆర్ అధికారులతో చెప్పారు
వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. మొన్నటి కంటే ఎక్కువ వరద వచ్చే అవకాశాలున్నాయని కేసీఆర్ అధికారులతో చెప్పారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎవరూ సెలవుల్లో వెళ్లవద్దని, విధుల్లోనే కొనసాగాలని కోరారు. గోదావరికి మరో మూడు రోజులు పాటు వరద వచ్చే అవకాశముందని కేసీఆర్ అధికారులకు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
మరోసారి గోదావరి....
జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కోరారు. పదకొండు జిల్లాలకు హై అలెర్ట్ ప్రకటించారని గుర్తు చేశారు. నదులు, ఉప నదులు ఇప్పటికే ఉప్పొంగుతున్నాయయన్నారు. ఎల్లుండి వరూ గోదావరి వరద ఉధృతి కొనసాగుతుందని తెలిపారు. గోదావరి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశముందని తెలిపారు. ఇది పరీక్షా సమయమని, నియోజకవర్గాల్లోనే ప్రజా ప్రతినిధులు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలను కూడా కేసిఆర్ హెచ్చరించారు. అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని కేసీఆర్ తెలిపారు.