ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ

కేంద్రప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలని తలపెట్టిన సింగరేణి నాలులు బొగ్గుగనులను నిలిపేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.

Update: 2021-12-09 03:34 GMT

కేంద్రప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలని తలపెట్టిన సింగరేణి నాలులు బొగ్గుగనులను నిలిపేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సింగరేణి కోల్ బెల్ట్ లో నాలుగు బొగ్గుగనుల ప్రయివేటీకరణను నిలిపేయాలని ఆయన కోరారు. దీనిని వ్యతిరేకిస్తూ నేటి నుంచి సింగరేణి కార్మికులు మూడు రోజుల పాటు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

విద్యుత్ అవసరాలను....
సింగరేణి బొగ్గు గనులు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీరుస్తున్నాయని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరా చేస్తున్న గనులను ప్రయివేటీకరణ చేయడం తగదని కేసీఆర్ లేఖలో ప్రధాని మోదీకి సూచించారు.


Tags:    

Similar News