చలికి వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు

Update: 2023-01-08 02:41 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ప్రజలు చలికి వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత చలి కనిపిస్తుంది. ముఖ్యంగా రెండు రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువయింది. ఉత్తరాదిన వీస్తున్న చలిగాలులతో ఈ పరిస్థితి తలెత్తిందని వాతవారణ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

కనిష్ట ఉష్ణోగ్రతలు...
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 11వ తేదీ వరకూ చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. ఉత్తర తెలంగాణలోని ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం, భధ్రాద్రి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏపీలో అరకు వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువయినట్లు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే వ్యాధుల బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News