ఆ బీరు అమ్మడం లేదు.. కలెక్టర్‌కు ఫిర్యాదు
వైన్ షాపుల్లో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు అందింది.
జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఒక వింతైన దరఖాస్తు అందింది. జిల్లాలోని వైన్ షాపుల్లో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. సోమవారం జిల్లాలోని ఐడీవోసిలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కు ఒక యువకుడు ఫిర్యాదు చేశాడు. కల్తీ, పేరూ ఊరు లేని బ్రాండ్ల బీర్లను అమ్ముతున్నారని యువకుడు బీరం రాజేష్ కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోరుట్ల, ధర్మపురిలో మాత్రం అన్ని బ్రాండ్ల బీర్లు దొరుకుతున్నాయని, కానీ జగిత్యాలలో మాత్రం కింగ్‌ఫిషర్ బీరు దొరకడం లేదని యువకుడు వాపోయాడు.
నాసిరకం బీర్లను...
దీనివల్ల అనేక మంది యూరిక్ ఆసిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. సిండికేట్ గా మారిన వైన్ షాపులు కొన్ని బ్రాండ్లను మాత్రమే అమ్ముతూ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఊరూరా బెల్ట్ షాపులున్నాయని, వాటిని అధికారులు కూడా పట్టించుకోలేదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన జగిత్యాల అదనపు కలెక్టర్ బి ఎస్ లత ఈ సమస్యను పరిష‌్కరించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ ను ఆదేశించడం కొసమెరుపు.