Challans నేడే ఆఖరి రోజు.. చెల్లించేయండి లేకుంటే?

పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు నేటితో రాయితీ గడువు ముగియనుంది

Update: 2024-01-31 05:00 GMT

పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు నేటితో రాయితీ గడువు ముగియనుంది. మరొకసారి పొడిగించే అవకాశం లేదని పోలీసు అధికారులు తెలిపారు.తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిన వాహనాలకు చలాన్లను విధించారు. ప్రభుత్వం పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు భారీ రాయితీ ప్రకటించింది. తొలుత పదోతేదీవరకూ ఆఖరి గడువుగా నిర్ణయించినా, తర్వాత పదిహేనోతేదీకి పొడిగించింది. ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ వరకూ రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని పేర్కొంది.

భారీ రాయితీని ప్రకటించినా...
ఇప్పటి వరకూ పెండింగ్ చలాన్ల రూపంలో ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలు పైగానే ఆదాయం లభించింది. అయితే ఇది ఎక్కువగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే చెల్లింపులున్నాయి. తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి పెద్దగా స్పందన లేదు. ఇంకా రెండున్నర కోట్ల చలాన్లు పెండింగ్ లోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ రోజు ఆఖరి గడువు అని, ఈరోజు చెల్లించకపోతే పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ద్విచక్రవాహనాలకు, ఆటోలకు ఎనభై శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీని ప్రకటించింది.


Tags:    

Similar News