Kamareddy : కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్

కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఇందుప్రియ ఎన్నికయ్యారు

Update: 2024-04-15 06:37 GMT

 kamareddy

కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఇందుప్రియ ఎన్నికయ్యారు. గత మున్సిపల్ ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం ఇటీవల నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందుప్రియను మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కామారెడ్డి మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు ఎన్నుకున్నారు.

ఛైర్‌పర్సన్ గా ఇందుప్రియ...
దీంతో కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయింది. మొన్నటివరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మద్దతిచ్చిన వార్డు మెంబర్లు కాంగ్రెస్ వైపు మళ్లడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఇందుప్రియ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇందుప్రియకు మెజార్టీ కౌన్సిలర్ల మద్దతును ప్రకటించడంతో ఆమె మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.


Tags:    

Similar News