జగ్గారెడ్డి ముఖ్య సమావేశం.. నిర్ణయం అప్పుడే

తన ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సమావేశం కాబోతున్నారు

Update: 2022-02-23 02:06 GMT

తన ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సమావేశం కాబోతున్నారు. ఆయన రేపు, ఎల్లుండి లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా ప్రకటనతో కాంగ్రెస్ పెద్దలు, సీనియర్ నేతలు బుజ్జగించారు. దీంతో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

భారీ బహిరంగ సభతో....
కానీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు జగ్గారెడ్డి ఇష్టపడటం లేదు. తన నియోజకవర్గం నేతలతో భేటీ అయి మరోసారి చర్చించనున్నారు. మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఇందుకోసం సంగారెడ్డి లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించాలని జగ్గారెడ్డి భావిస్తున్నారు.


Tags:    

Similar News