"ఎవడ్రా మమ్మల్ని ఆపేది" : రేణుక చౌదరి

మరోవైపు..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కనుసన్నల్లో..

Update: 2023-07-02 07:28 GMT

కాంగ్రెస్ శాసనసభా పక్ష (సిఎల్‌పి) నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు ఆదివారం ఖమ్మంలో తెరదించనున్నారు. సాయంత్రం జరిగే జనగర్జన సభకు రాహుల్ గాంధీ వస్తుండటంతో.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా ఖమ్మం సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పారని రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెడుతున్నారని ప్రశ్నించారు.

"ఖమ్మంలో జరిగే సభకు మా ప్రజలు, మేము వెళ్తున్నాం. నువ్వెవడ్రా ఆపడానికి ? బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా ? పిచ్చి డ్రామాలొద్దు. మంచిపనులు చేసి ఉంటే ఈ దుస్థితికి వచ్చేవారు కాదు. బుద్ధి గడ్డిమేస్తే ఇలాగే ఉంటుంది. ఎవడ్రా మమ్మల్ని ఆపేది.. నేనూ చూస్కుంటా" .. అంటూ రేణుక చౌదరి అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. అనంతరం రోడ్డుపై పెట్టిన బారికేడ్లను అనుచరులతో కలిసి ఆమె పక్కకు నెట్టి వెళ్లారు.
మరోవైపు..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాల్లో రోడ్లను మూసివేయిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తల్ని భయబ్రాంతులకి గురిచేస్తున్నారని.. ఇప్పటికే 1700 వాహనాలను సీజ్ చేశారని తెలిపారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. సభకు వెళ్లే వారికి ప్రభుత్వ పథకాలు లభించవని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


Tags:    

Similar News