రేపు ప్రధానితో కోమటిరెడ్డి భేటీ
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు ప్రధాన నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు ప్రధాన నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. నియోజకవర్గం అభివృద్ధి పనులపై కోమటిరెడ్డి చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. ఆయన వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. గతంలోనూ కోమటిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తాను నియోజకవర్గంలో అభివృద్ధి పనులకే కలిశానని చెప్పుకొచ్చారు.
నియోజకవర్గం అభివృద్ధి కోసమే....
కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి నేతగా కొనసాగుతున్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ పై పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనికి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జును ఖర్గేను కలసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు కూడా. తాజాగా ఆయన ప్రధానితో భేటీ కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.