త్వరలోనే బస్సు యాత్ర
తెలంగాణలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. బస్సు యాత్ర ప్రారంభించనుంది
తెలంగాణలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. బస్సు యాత్ర ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈరోజు సాయంత్రానికి ఖరారయ్యే అవకాశముంది. అలంపూర్, ఆదిలాబాద్‌లలో ఎక్కడో ఒకచోట నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల10న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు.
రానున్న రాహుల్
వీలయినంత త్వరగా ప్రజల్లోకి వెళ్లి గ్యారంటీ కార్డుతో గెలవాలని కాంగ్రెస్ యోచిస్తుంది. బస్సు యాత్రలో నేతలందరూ పాల్గొని ఐక్యతారాగం చాటేలా చర్యలు తీసుకోనున్నారు. 19, 20,21వ తేదీల్లో బస్సుయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు ముగింపు కార్యక్రమానికి సోనియా గాంధీ కూడా హాజరు కానున్నారని తెలిసింది.