Telangana : ఆ రెండు గ్యారంటీలూ వారికేనట
తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది
తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభలో రెండు గ్యారంటీలను ప్రకటించారు. రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ త్వరలో ఇస్తామని తెలిపారు. తెలంగాణలో లక్ష మంది మహిళలను ఆహ్వానించి, ప్రియాంక గాంధీ సమక్షంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న...
అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఇవి వర్తిస్తాయని చెప్పారు. తెల్లకార్డుదారులకు మాత్రమే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు పథకాలు అమలవుతాయని ఆయన విస్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు పరిష్కరించేదెప్పుడు? కొత్త తెల్ల రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నలకు మాత్రం అధికారుల వద్ద సమాధానం లేకపోవడంతో కొంత అయోమయం నెలకొంది.