నేడు కాంగ్రెస్ ఆందోళన... రేవంత్ పిలుపు

తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు నిరసనగా నేడు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది

Update: 2022-04-07 01:38 GMT

తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు నిరసనగా నేడు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలంటూ కాంగ్రెస్ విద్యుత్తు సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పాటు పెట్రోలు, డీజిల్ గ్యాస్ ధరల పెంపుదలకు నిరసనగా కూడా ఆందోళన చేపట్టనుంది. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

విద్యుత్తు సౌధ ముట్టడికి....
ఈరోజు కాంగ్రెస్ విద్యుత్ సౌధతో పాటు పౌరసరఫరాల కార్యాలయాన్ని కూడా ముట్టడించనుంది. వరది ధాన్యం కొనుగోలు చేసేంత వరకూ తాము ప్రజల పక్షాన పోరాడుతుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి విద్యుత్తు సౌధ వరకూ చేరుకుంటారు. అయితే పోలీసులు కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసే అవకాశముంది. పోలీసులు భారీ బందోబస్తును విద్యుత్తు సౌధ, పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News