నేడు కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష
నేడు తెలంగాణలో పోలీసు శాఖలో కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది.
నేడు తెలంగాణలో పోలీసు శాఖలో కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ భర్తీకి ఈ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. సివిల్ కానిస్టేబుళ్లలో 15,644. ఎక్సైజ్ శాఖలో 614, ట్రాన్స్‌పోర్టు విభాగంలో 63 ఖాళీలున్నాయి. ఈరోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాత పరీక్ష జరగనుంది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.
భారీ బందోబస్తు...
కానిస్టేబుళ్ల రాత పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఈవెంట్స్ తో పాటు మెయిన్స్ కూడా ఉంటాయి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరీక్షలో మొత్తం 200 మార్కులకు అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.