Telangana : తెలంగాణలో యాక్టివ్ కేసులు ఎన్నంటే?
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. మొత్తం 59 కేసులు యాక్టివ్ గా ఉండగా అందులో 45 హైదరాబాద్ నగరంలోనివేనని వైద్యులు తెలిపారు.
వైరస్ నుంచి...
దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య 8,44,566 గా నమోదయింది. కొత్తగా వైరస్ సోకిన వారిలో నలుగురు కోలుకోగా, ఇప్పటివరూ 8,40,396 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా 4,111 మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 59 కరోనా యాక్టివ్ కేసులున్నాయని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.