హుండీల ఆదాయం తగ్గిందా?

మేడారం సమ్మక్క, సారలమ్మ హుండీల లెక్కింపు పూర్తయింది. దాదాపు 11 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు

Update: 2022-03-08 03:08 GMT

మేడారం సమ్మక్క, సారలమ్మ హుండీల లెక్కింపు పూర్తయింది. దాదాపు 11 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. గత నెలలో జరిగిన మేడారం జాతరకు పెద్దయెత్తున భక్తులు వచ్చారు. దాదాపు కోటిన్నర మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా. జాతర నాలుగు రోజులు పాటు ఉన్నా, అంతకు ముందు నెల రోజుల నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు మేడారం వచ్చారు.

లెక్కింపు తర్వాత....
దీంతో మేడారంలో మొత్తం 517 హుండీలను ఏర్పాటు చేశారు. వీటిని హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భద్రత మధ్య లెక్కించారు. అయితే 11,45,34,526 రూపయాలు ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. నగదుతో పాటు 631 గ్రాముల బంగారం, 48,350 కిలోల వెండి కూడా భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 3 లక్షల రూపాయల విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో చేరింది. అయితే గత జాతర కంటే ఆదాయం తగ్గిందంటున్నారు. 2020 లో మేడారం జాతరకు 11.64 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 11.45 కోట్ల ఆదాయం మాత్రమే హుండీల రూపంలో వచ్చింది.


Tags:    

Similar News