మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకులో 12 కోట్లు హాంఫట్

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ కేటుగాళ్లు అటాక్ చేశారు. సర్వర్ ను హ్యాక్ చేసి పన్నెండు కోట్ల రూపాయలను కొల్లగొట్టారు.

Update: 2022-01-24 13:01 GMT

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ కేటుగాళ్లు అటాక్ చేశారు. సర్వర్ ను హ్యాక్ చేసి పన్నెండు కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. ఈ 12 కోట్ల రూపాయల నగదును 120 అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు మహేష్ కో ఆపరేటవ్ బ్యాంకు అధికారులు గుర్తించారు. దీనిపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

120 బ్యాంకు ఖాతాలకు...
మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు హైదరాబాద్ లో అనేక మంది ఖాతాదారులను కలిగి ఉంది. ఈ బ్యాంకు లావాదేవీలు కూడా అధిక సంఖ్యలోనే రోజువారీ ఉంటాయి. దీంతో సైబర్ నేరగాళ్లు మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకుపై కన్నేశారు. సర్వర్ ను ఎలా హ్యాక్ చేయగలగారన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Tags:    

Similar News