మల్లురవి పై కేసు నమోదు
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్ పర్యవేక్షణ బాధ్యత తనదేనని చెప్పడంతో పాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మల్లురవిపై కేసును పోలీసులు నమోదు చేసినట్లు తెలిసింది.
తనదే బాద్యతనంటూ...
కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి కేసులో మల్లు రవిని నిందితుడిగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో సీసీఎస్ పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి పలు హార్డ్ డిస్క్ లను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రేపు మల్లురవిని విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా ఆయన నిన్ననే హాజరై వివరణ ఇచ్చారు. రేపు మరోసారి పోలీసుల ఎదుట విచారణకు మల్లు రవి హాజరుకానున్నారు.