నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఈరోజుతో నామినేషన్ల గడువు ముగియనుంది.

Update: 2022-10-14 04:26 GMT

మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఈరోజుతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకూ 56 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు 87 సెట్ల నామినేషన్లు వేశారని చెప్పారు.

ప్రధాన పార్టీలన్నీ....
రేపు నామినేషన్ల పరిశీలన చేస్తారు. 17వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. వచ్చే నెల మూడో తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఆరో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం ఊపందుకుంది.


Tags:    

Similar News