గల్ఫ్ కార్మికుల సౌకర్యాలపై అంతర్జాతీయ దౌత్య కేంద్రం జెనీవాలో చర్చ 

అంతర్జాతీయ దౌత్య కేంద్రం జెనీవాలో మంద భీంరెడ్డి వందకుపైగా దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్న గ్లోబల్ ఫోరం ఆన్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సదస్సు స్విట్జర్లాండ్ దేశం జెనీవాలో......

Update: 2024-01-23 05:00 GMT

 అంతర్జాతీయ దౌత్య కేంద్రం జెనీవాలో మంద భీంరెడ్డి వందకుపైగా దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్న గ్లోబల్ ఫోరం ఆన్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సదస్సు స్విట్జర్లాండ్ దేశం జెనీవాలో జరుగుతున్న సందర్బంగా వలసలపై పనిచేస్తున్న పౌర సమాజ సంస్థల ప్రనిధుల ఆసియా బృందంలో జగిత్యాల జిల్లావాసి మంద భీంరెడ్డి, హైదరాబాద్ కు చెందిన సిస్టర్ లిజీ జోసెఫ్, సౌదీ అరేబియాలో నివసించే అనంతపూర్ జిల్లా వాస్తవ్యురాలు చేతన ఉన్నారు. 




గ్రాస్ రూట్స్ ఫోరం ఆన్ మైగ్రేషన్ గవర్నెన్స్ (వలసల నిర్వహణపై అట్టడుగుస్థాయి వారి వేదిక) సదస్సు జెనీవాలో సోమవారం ప్రారంభం కానున్న  సందర్బంగా జరిగిన సన్నాహక సమావేశంలో మంద భీంరెడ్డి గల్ఫ్ దేశాలలో కార్మికుల సౌకర్యాలపై చర్చలో పాల్గొని పలు అంశాలను లేవనెత్తారు. ప్రవాసి కార్మికులకు గల్ఫ్ ప్రభుత్వాలు అందిస్తున్న సేవలు, బీమా, జీతాల గురించి సుధీర్ తిరునిలత్ (బహరేన్), ప్రసాద్ క్రిష్ణన్ (దుబాయి) వివరించారు. 

Tags:    

Similar News