డెక్కన్ కాలేజీ విద్యార్థుల కేరింతలు

బుద్ధ వనాన్ని చూచి మైమరిచిన దక్కన్ కాలేజీ విద్యార్థులు - --విశిష్టతలను వివరించిన శివనాగిరెడ్డి

Update: 2023-10-15 06:18 GMT

బుద్ధ వనాన్ని చూచి మైమరిచిన దక్కన్ కాలేజీ విద్యార్థులు - --విశిష్టతలను వివరించిన శివనాగిరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు తమను ఎంతో ఆకట్టుకుందని, పూణేలోని డెక్కన్ కాలేజీలో, ఎం.ఏ. పురావస్తు శాస్త్రం చదువుతున్న విద్యార్థులు అన్నారు. ఆచార్య గన్ వీర్ ఆధర్యంలో 40 మంది విద్యార్థులు, బుద్ధ క్షేత్రాల అధ్యయనంలో భాగంగా శనివారం నాడు వారు బుద్ధవనాన్ని సందర్శించారు.



 బుద్ధవనం ప్రత్యేక అధికారి, మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశాలపై, బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి డెక్కన్ కాలేజీ విద్యార్థులను బుద్ధవనంలోని ఎంట్రన్స్ ప్లాజా, బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూప వనం మహాస్తుపాల గురించి వివరించగా, వారు ఆసక్తికరంగా విని బుద్ధ వనం లాంటి బుద్ధ వారసత్వ తీన్మార్కును మేమెక్కడ చూడలేదన్నారు.




 




 బుద్ధుని జీవిత జాతక కథలు, బుద్ధ చిహ్నాలు, వాస్తు విశేషాలు పై విద్యార్థుల ప్రశ్నలకు శివనాగిరెడ్డి సాదరంగా సమాధానాలు ఇచ్చారు. బుధవారం శిల్ప సౌందర్యం తమను మంత్రముగ్ధుల్ని చేసిందని, నిర్మాణాలు అదరహో అనిపించాయని వారన్నట్లు శివ నాగిరెడ్డి చెప్పారు.




 


Tags:    

Similar News