స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన అధికారి
ముఖ్యమంత్రి కార్యాలయ అధకారి స్మితా సబర్వాల్ ఇంటికి ఒక డిప్యూటీ తహసిల్దార్ అర్ధరాత్రి ప్రవేశించి అలజడి సృష్టించాడు
ముఖ్యమంత్రి కార్యాలయ అధకారి స్మితా సబర్వాల్ ఇంటికి ఒక డిప్యూటీ తహసిల్దార్ అర్ధరాత్రి ప్రవేశించి అలజడి సృష్టించాడు. అర్థరాత్రి స్మితా సబర్వాల్ ఇంటికి వచ్చిన డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్‌కుమార్ రెడ్డి ప్రవేశించడంతో ఎందుకు వచ్చావని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. తాను డ్యూటీ విషయంలో మాట్లాడేందుకు వచ్చానని ఆనంద కుమార్ రెడ్డి తెలిపారు. అయితే ఇంటికి ఎందుకొచ్చావంటూ ఆమె గట్టిగా నిలదీయడంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.
అరెస్ట్ చేసి....
భద్రతాసిబ్బంది ఆనంద్ కుమార్ రెడ్డి, అతని స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అసలు ఆనంద్‌కుమార్ రెడ్డి ఎందుకు వచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా సబర్వాల్ మాత్రం మహిళలు డోర్ లాక్ చేసుకుని ఉండటం మంచిదని తెలిపారు. ఏదైనా అనుకోని వ్యక్తులు వస్తే వెటనే 100 నెంబర్ కు డయల్ చేయాలని ఆమె కోరారు. తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని వివరించారు. అలాంటి పరిస్థితుల్లోనూ తాను భయపడలేదని తెలిపారు. మహిళలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనాలని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు.