రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2024-05-04 04:31 GMT

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనేక ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. పెద్దయెత్తున నిరసనలు కూడా జరిగాయి. కానీ పోలీసులు మాత్రం వర్సిటీ వీసీతో పాటు అనేకమందిపై దాఖలైన కేసుల్లో ఆధారాల్లేవని నివేదిక సమర్పించింది.

మరోసారి దర్యాప్తు...
అయితే రోహిత్ వేముల తల్లి మరోసారి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసు శాఖ నిర్ణ‍ించింది. దర్యాప్తు అధికారి న్యాయస్థానానికి ఇచ్చిన నివేదికపై మళ్లీ ఆందోళనలు మొదలు కావడంతో తిరిగి దర్యాప్తు చేయాలని పోలీసు నిర్ణయించింది. రోహిత్ వేముల దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ తెలిపారు. మరోవైపు ఈ కేసును పునర్విచారించేందుకు అనుమతివ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నారు.


Tags:    

Similar News