Telangana : బెట్టింగ్ యాప్స్ పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం
బెట్టింగ్ యాప్స్ పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ నిర్ణయం తీసుకున్నారు.;

బెట్టింగ్ యాప్స్ పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ నిర్ణయం తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ పై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సిట్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. బెట్టింగ్ యాప్స్ పై విచారణ నిమిత్తం ఐజీ ఎం. రమేష్ ను విచారణాధికారిగా నియమించింది.
ప్రత్యేక దర్యాప్తు బృందంలో...
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఎస్.పిలు సింధూరశర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్సీ శంకర్, చంద్రకాంత్ లు సభ్యులుగా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ పై విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ పై అనేక కేసులు నమోదయిన నేపథ్యంలో సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో నమోదయిన రెండు కేసులను సిట్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.