Speaker : స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే

తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది

Update: 2023-12-13 07:03 GMT

 telangana speaker election

తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ తరుపున గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇస్తుండటంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

కేసీఆర్ ను కలసి...
నిన్న యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు స్పీకర్ ఎన్నికకు సహకరించాలని కోరారు. అందుకు కేసీఆర్ కూడా అంగీకరించడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీఆర్ఎస్ తరుపున మాజీ మంత్రి కేటీఆర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


Tags:    

Similar News