ఈటలకు భారీగా భద్రత పెంపు
ఇటీవల ఈటల ఇంటికి వెళ్లిన డీసీపీ సందీప్ రావు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో డీజీపీకి
కొద్దిరోజుల కిందట తనను చంపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, రూ.20 కోట్లు సుపారీ కూడా ఇచ్చారని తాజాగా ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. తనను జాగ్రత్తగా ఉండాలంటూ కొన్ని నెలలుగా బెదిరిస్తున్నారని, కానీ.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని ఈటల చెప్పారు. తనది భయపడే జాతి కాదని అన్నారు.
ఆయన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. నేటి నుండి ఆయనకు వై ప్లస్ భద్రత కల్పించనున్నారు. ఇటీవల ఈటల ఇంటికి వెళ్లిన డీసీపీ సందీప్ రావు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో డీజీపీకి ఇచ్చారు సందీప్ రావు. దీంతో ఈటలకు ప్రాణహాని ఉందని నిర్ధారణ అయ్యింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఈటలకు వై ఫ్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది.. ఈటలకు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. ఐదుగురు బాడీగార్డ్స్ ఎప్పుడూ ఈటల రాజేందర్ వెంట ఉంటారు. మరో ఆరుగురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్.. షిఫ్ట్‌కు ఇద్దరు చొప్పున, మూడు షిఫ్టుల్లో ఆయనకు భద్రత కల్పిస్తారు. జులై ఉదయం నుంచి స్టేట్ కేటగిరీ వై ఫ్లస్ భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకు అందుబాటులో ఉండనుంది. ఇప్పటి వరకు ఈటలకు 2 ప్లస్ 2 భద్రత మాత్రమే ఉండేది. ఇప్పుడు సెక్యూరిటీని పెంచారు. నయీంలాంటి వాళ్లు చంపడానికి రెక్కీ నిర్వహిస్తేనే భయపడలేదని.. తనను చంపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కుట్ర పన్నారంటూ తన సతీమణి జమున చెప్పిన విషయం వాస్తవమేనని ఈటల అన్నారు. తన భర్త రాజేందర్‌ను హత్య చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఈటల జమున ఆరోపించారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ కౌశిక్‌రెడ్డి తన సన్నిహితులతో అన్నట్లు తెలిసిందన్నారు.