బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత

1984లో బీజేపీ తరపున పోటీ చేసి, గెలిచిన ఇద్దరు ఎంపీల్లో చందుపట్ల ఒకరు. అప్పట్లో హన్మకొండ పార్లమెంట్ నుంచి మాజీ ప్రధాని

Update: 2022-02-05 11:16 GMT

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. చందుపట్ల జంగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ల జంగారెడ్డి 1935, నవంబర్ 18న జన్మించారు. 1953లో సుధేష్ణను వివాహం చేసుకోగా.. ఆయనకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

1984లో బీజేపీ తరపున పోటీ చేసి, గెలిచిన ఇద్దరు ఎంపీల్లో చందుపట్ల ఒకరు. అప్పట్లో హన్మకొండ పార్లమెంట్ నుంచి మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహారావుపై 54 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో గెలుపొందారు జంగారెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. జంగారెడ్డి మరణంపై.. ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ట్విట్టర్ ద్వారా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.




Tags:    

Similar News