వివేకా హత్య కేసు వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జూన్ 2వ తేదీకి వాయిదా పడింది;

Update: 2023-04-28 06:43 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జూన్ 2వ తేదీకి వాయిదా పడింది. ఈ హత్య కేసును విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 2019 మార్చి 19వ తేదీన పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే.

జూన్ 2వ తేదీకి...
దీనిపై సీబీఐ నేటికీ విచారణ జరుపుతుంది. సుప్రీంకోర్టు కూడా జూన్ 30వ తేదీ వరకూ విచారణకు గడువు పెంచుతూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టు కూడా వివేకానందరెడ్డి హత్య కేసును జూన్ 2వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News