ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం
ప్రముఖ జ్యోతిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం చెందారు.;
ప్రముఖ జ్యోతిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం చెందారు. ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆయనను కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువరు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
జ్యోతిష్యం ద్వారా....
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి చేరువయ్యారు. ఆయన రచించిన పంచాగాన్ని ఎక్కువ మంది విశ్వసిస్తుంటారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుంటూరు అయినప్పటికీ ఆయన హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆశ్రమాన్ని స్థాపించి ప్రతి శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు.