మణికొండ ప్లే స్కూల్లో అగ్నిప్రమాదం
దాంతో టీచర్లు, విద్యార్థులు గదుల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం స్కూల్ మొదటి అంతస్తులో..
హైదరాబాద్ లోని మణికొండలో ఉన్న జోల్లి కిడ్స్ ప్లే స్కూల్ లో పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో టీచర్లు, విద్యార్థులు గదుల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం స్కూల్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను బయటకు పంపించారు. ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలకు ఎలాంటి హాని జరగలేదని ప్లే స్కూల్ నిర్వాహకులు పేర్కొన్నారు.
కాగా.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ప్లే స్కూల్ లో సుమారు 100 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారులు ఆడుకునే బొమ్మలు, పలు వస్తువులు మంటల్లో దగ్ధమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకుని.. పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.