ఎమ్మెల్యే షకీల్‌కు షాక్

నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీ‌ల్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి

Update: 2023-05-11 05:26 GMT

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ తప్పడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన వ్యతిరేకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీ‌ల్‌కు కూడా తలనొప్పి మాములుగా లేదు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కనపడుట లేదంటూ పోస్టర్లు బోధన్ లో వెలిశాయి. గత ఇరవై రోజుల నుంచి షకీల్ తమకు కనిపించకుండా పోయాడని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.

తడిసిన ధాన్యాన్ని...

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు వెలియడం ప్రాధాన్యత సంతరించుకుంది. ధాన్యాన్ని కొంటానని చెప్పిన షకీల్ ఏమయి పోయాడంటూ ఫ్లెక్సీలలో ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ ఇటువంటి నీచమైన పనులు చేస్తుందని, ప్రజలు దీనిని పట్టించుకోరని షకీల్ వర్గం అంటుంది. మున్సిపల్ సిబ్బంది వెంటనే ఆ ఫ్లెక్సీలను బోధన్ లో తొలిగించే కార్యక్రమం చేపట్టారు. 

Tags:    

Similar News