సాగర్ కు చేరుతున్న వరద నీరు
నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చిచేరుతుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 30 టీఎంసీల నీరు చేరింది
నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చిచేరుతుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 30 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద ఇన్‌ఫ్లో 4,19,588 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 34,088 క్యూ సెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 558.60 అడుగులుగా ఉంది.
నీటి సామర్థ్యం...
నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.5050 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం సాగర్ నీటి సామర్ధ్యం 229.1358 టీఎంసీలుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు సాగర్ కు వచ్చి చేరుతుంది. సాగర్ వద్ద పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది.