మల్లు స్వరాజ్యం మృతి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మార్చి 2వ తేదీన బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో....
మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా కరివిరాల గ్రామంలో 1931లో జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో తన సహచరుడైన మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహమాడారు. గిరిజన హక్కుల కోసం ఆమె అనేక పోరాటాలు చేశారు. మల్లు స్వరాజ్యం రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1945- 48 కాలంలో సాయుధ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నిజాం సర్కార్ కు ముచ్చెమటలు పట్టించారు. రజాకార్లను తరిమికొట్టారు. మల్లు స్వరాజ్యం మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.