తెలంగాణ ఆశావర్కర్లకు శుభవార్త !
తెలంగాణ ఆశావర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను
తెలంగాణ ఆశావర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు పెంచిన ప్రోత్సాహకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటి వరకూ రూ.7500 అందుకుంటున్న ఆశావర్కర్లకు ఇకపై నెలకు రూ.9750 అందనున్నాయి. తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ పై స్పందించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Also Read : జగన్ కు నారా లోకేష్ లేఖ