Telangana : మంత్రి వర్గ సమావేశంలో గుడ్ న్యూస్ చెప్పనున్నారా? ఆ నిర్ణయం కోసమే వెయిటింగా?

ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ నేడు జరిగే తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో తీసుకునే అవకాశముందని చెబుతున్నారు

Update: 2024-10-26 04:07 GMT

ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ నేడు జరిగే తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశముంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అందులో ముఖ్యంగా హైడ్రాకు మరింత బాధ్యతలను అప్పగించే విషయంపై చర్చించనున్నారు. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలపనున్నారు.

మూసీ నది ప్రాజెక్టు...
ఇక ప్రధానమైనది మూసీ నది ప్రాజెక్టు. మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. సియోల్ కు ఇప్పటికే కొందరు మంత్రుల బృందం అక్కడ ప్రాజెక్టును అధ్యయనం చేయడానికి వెళ్లింది. వారు ఇచ్చే నివేదికపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. మూసీ నది నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు పెద్ద భవనాలను కూల్చివేస్తే దాని స్థానంలో రెండు వందల గజలా స్థలాన్నిఆ ప్రాంతానికి దగ్గరలోనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇళ్లుకోల్పోయిన ప్రాంతానికి దగ్గరలోనే బాధితులకు ఇవ్వాలని భావిస్తున్నారు. అప్పుడే పెద్దగా వారు సెంటిమెంట్ గా ఫీలవ్వరని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది.
కొత్త రేషన్ కార్డులు...
మరో ప్రధానమైన అంశం.. రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఇప్పటికే అథ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చే అవకాశముంది. ఎవరెవరికి రేషన్ కార్డులు ఇవ్వవచ్చు? ఎంత వరకూ ఇవ్వవచ్చు? అన్నదానిపై ఒక స్పష్టతకు మంత్రి వర్గ ఉప సంఘం రావడంతో దీనిపై కూడా చర్చ జరిగే అవకాశముంది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తే సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే తెలుపు రంగు రేషన్ కార్డులకు సంబంధించి విధివిధానాలపై మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే రైతు బంధు పథకంపై కూడా మంత్రులు తలో ఒక మాట మాట్లాడుతుండంతో కొంత ఈ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం. మొత్తం మీద ఈ సమావేశంలో అనేక అంశాలపై నిర్ణయాలను తీసుకోనున్నారు.


Tags:    

Similar News