అలా అయితే ఎన్నికల్లో పోటీ చేయను

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడంపై కొంత స్పష్టత ఇచ్చారు.

Update: 2023-03-01 02:56 GMT

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడంపై కొంత స్పష్టత ఇచ్చారు. తనపై బీజేపీ అధినాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని రాజాసింగ్ తెలిపారు. అయితే పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ ను తొలగిస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.

సస్పెన్షన్ తొలగించకుంటే....
సస్పెన్షన్ తొలగించకుంటే పోటీకి దూరంగా ఉంటానని రాజాసింగ్ చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోట ీచేసే ఉద్దేశ్యం కూడా తనకు లేదని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు తాను అభిమానిని అని, పార్టీకి వ్యతిరేకంగా తాను పనిచేయబోనని ఆయన చెప్పారు. రాష్ట్ర నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఆశీస్సులు తను ఉన్నాయన్నారు.


Tags:    

Similar News