బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గవర్నర్ బాసట

గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంపై గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ స్పందించారు.

Update: 2022-06-16 03:17 GMT

గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంపై గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ స్పందించారు. ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎస్ సీఎంవో కు తమిళి సై ట్యాగ్ చేశారు. తల్లిదండ్రుల కలలు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వర్షంలోనూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను చూసి తమిళిసై ఆవేదన చెందారు. తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.

మూడు రోజుల నుంచి...
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వారు వర్షాన్ని సయితం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెళ్లి వారికి హమీ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమావేశమై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై చర్చించారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా, విద్యార్థులు మాత్రం తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ ఆందోళన ఆపేది లేదని వారు స్పష్టం చేశారు.


Tags:    

Similar News