నిరుద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది.

Update: 2022-07-03 02:35 GMT

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇరిగేషన్ శాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ, 212 జూనియర్ టెక్నికల్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది.

వివిధ శాఖల్లో...
అలాగే భూగర్భ జల శాఖలో 88, ఆర్ఆండ్‌బీ లో 38 సివిల్ ఏఈఈ, 13 ఎలక్ట్రికటల్ ఏఈఈ, 60 జూనియర్ టెక్నకిల్ ఆఫీసర్, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇక ఆర్థిక శాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అనుమతి అభించింది. ఇప్పటి వరకూ ఆర్థిక శాఖ మొత్తం 46,998 పోస్టు భర్తీకి అనుమతిని ఇచ్చింది.


Tags:    

Similar News