షా తో భేటీ తర్వాత తమిళి సై ఏమన్నారంటే?

తెలంగాణలో సమస్యలను అమిత్ షాకు వివరించానని గవర్నర్ తమిళి సై అన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.;

Update: 2022-04-07 07:53 GMT

తెలంగాణలో సమస్యలను అమిత్ షాకు వివరించానని గవర్నర్ తమిళి సై అన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి రాష్ట్రంలోని అనేక అంశాలపై చర్చించామని చెప్పారు. అమిత్ షాతో మాట్లాడిన విషయాలను బయటకు చెప్పలేనని ఆమె అన్నారు. తాను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలకోసమేనని తమిళిసై అన్నారు.

అందరికీ తెలిసిందే....
తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని ఆమె చెప్పారు. రాజ్ భవన్ తలుపులు ఎప్పడూ తెరిచే ఉంటాయని, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చని ఆమె చెప్పారు. మేడారం, భద్రాచలం తాను రోడ్డు మార్గంలోనే వెళ్లానని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని తమిళి సై చెప్పారు. తెలంగాణలో గవర్నర్ పరిస్థితి ఎలా ఉందో అందరూ చూడాలని ఆమె కోరారు. అయితే అమిత్ షాకు గవర్నర్ తమిళి సై నివేదిక ఇచ్చినట్లు సమాచారం.


Tags:    

Similar News