ఒమిక్రాన్ అలెర్ట్ : రానున్న నాలుగు వారాలు కీలకం

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు

Update: 2021-12-30 07:13 GMT

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. దాదాపు ముప్ఫయి రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన చెందారు. రానున్న నాలుగు వారాలు అత్యంత కీలకమని ఆయన చెప్పారు.

కోవిడ్ నిబంధనలను....
ఇప్పటికే తెలంగాణలో 64 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ ను తీసుకోవాలని శ్రీనివాస్ సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని, మాస్క్, శానిటైజర్ లేకుండా బయటకు రావడం ప్రమాదకరమని ప్రజలు గుర్తించాలని శ్రీనివాస్ కోరారు.


Tags:    

Similar News