Hyderabad : అసంపూర్తిగా ముగిసిన జూడాల చర్చలు
జూనియర్ డాక్టర్లతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరిసింహ చర్చలు జరిపారు. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి
జూనియర్ డాక్టర్లతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరిసింహ చర్చలు జరిపారు. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రుల క్వార్టర్స్ లో జరిగిన ఈ సమావేశంలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను మంత్రి ఎదుట ఉంచారు. అందులో కొన్నింటిని పరిష్కరిస్తామని దామోదర రాజనరిసింహ హామీ ఇచ్చారు.
కొన్ని విషయాల్లో...
మరికొన్ని విషయాల్లో ముఖ్యమంత్రితో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్ల మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ సమస్యలను సత్వరం పరిష్కరించాంటూ, డిమాండ్లను నెరవేర్చాలంటూ జూనియర్ డాక్టర్లు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగడంతో ఓపీకి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలకు మినహా తాము మిగిలిన వైద్య సేవలకు హాజరుకాబోమని చెప్పడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది.