kalvakuntla Kavitha : నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ

ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు సమన్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది

Update: 2024-03-19 02:15 GMT

ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు సమన్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు మనీ లాండరింగ్ కేసులో కవితను ఈ నెల 15న అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీకి తరలించి అక్కడ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడాన్ని తప్పుపడుతూ, నళినీ చిదంబర్ కేసును ప్రస్తావిస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మహిళలను ఇంటివద్ద...
దీనిపై నేడు విచారణ జరగనుంది. సీఆర్పీసీ 160 ప్రకారం మహిళలను ఇంటివద్దనే విచారించాలన్న నిబంధనను ఈడీ అధికారులు పట్టించుకోలేదని కవిత తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత తరుపున న్యాయవాదులు మరో పిటీషన్ కూడా దాఖలు చేశారు. వీటిపై నేడు విచారణ జరగనుంది. కవితను మూడో రోజు ఈడీ అధికారులు నేడు ప్రశ్నించాల్సి ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు రానుంది.


Tags:    

Similar News