రెండు రోజులు భారీ వర్షాలే
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో 12 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలోకి కూడా వరద నీరు చేరింది. దీంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయంది. నిన్న అనేకచోట్ల పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. హైదరాబాద్ లో వర్షం ఆగడం లేదు. ఉద్యోగాలకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలోనూ..
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో అత్యధికంగా 23.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. కారంపూడి మండలంలోని శంకరాపురంలో 18.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిదంి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచింది.