భారీ నుంచి అతిభారీ వర్షాలు.. నేడు 12 జిల్లాలకు రెయిన్ అలర్ట్

ఇక గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్..

Update: 2023-07-05 04:20 GMT

తెెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ మీదుగా వీస్తుండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఇక గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంటూ ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బుధవారం (జులై5) రాష్ట్రంలోని 12 జిల్లాల్లో జోరుగా వానలు పడే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. అలాగే గురువారం (జులై6) 9 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. నేడు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. మరో 9 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వివరించింది. నిన్న రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.





Tags:    

Similar News