Breaking : ఎంసెట్ పేరు మార్పు... ఉమ్మడి పరీక్ష తేదీల ఖరారు

తెలంగాణలో ఉమ్మడి పరీక్షలకు తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది;

Update: 2024-01-25 12:23 GMT

తెలంగాణలో ఉమ్మడి పరీక్షలకు తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్ ను eapset గా మార్చారు. పీసెట్, లాసెట్ పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 9 13 వరకూ eapset పరీక్షలు జరుగుతున్నాయి. మే 23న ఎడ్‌సెట్, జూన్ 3వ తేదీన పీజీ లాసెట్, మే 6న ఈసెట్, జూన్ 4,5 తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరుగుతాయి.

ఈ తేదీలలోనే...
ఈ మేరకు ఉన్నత విద్యామండలి తేదీలను ప్రకటించింది. ఈ తేదీల్లోనే ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ తేదీలకు ఆమోద ముద్ర వేయడంతో నేడు అధికారికంగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులందరూ ఈ మేరకు అర్హత పరీక్షలకు రాసేందుకు సిద్ధమవ్వాలని కోరింది.


Tags:    

Similar News