విద్యా సంస్థలకు సెలవు
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే పలు జిల్లాలలో అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే పలు జిల్లాలలో అధికారులు పిల్లలను స్కూల్స్ కు సెలవు ప్రకటించగా.. హైదరాబాద్ నగరంలో కూడా పలు స్కూల్స్ సెలవులు ప్రకటించామని మెసేజీలు పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు పలు విద్యాసంస్థలు హాలిడే ప్రకటించాయి. శనివారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నిర్మల్, ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జనగాం, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్క అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి,మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.