భువనగిరిలో పరువుహత్య

2020, ఆగస్టు 16న భార్గవి అనే యువతిని రామకృష్ణ ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప. హోంగార్డుగా సస్పెండ్

Update: 2022-04-17 07:15 GMT

తుర్కపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తుర్కపల్లి గుప్తనిధుల కేసులో సస్పెండ్ అయిన హోంగార్డు రామకృష్ణ.. శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. రెండ్రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన రామకృష్ణ.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. రామకృష్ణని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతలోనే శవమై కనిపించడంతో పరువు హత్యగా భావించారు పోలీసులు.

2020, ఆగస్టు 16న భార్గవి అనే యువతిని రామకృష్ణ ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప. హోంగార్డుగా సస్పెండ్ అయిన తర్వాతి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. రామకృష్ణ భార్గవిని పెళ్లాడటం ఆమె మేనమామ వెంకటేష్ కు ఇష్టం లేదు. దాంతో రామకృష్ణను హత్య చేసేందుకు రౌడీ షీటర్ లతీఫ్ కు సుపారీ ఇచ్చాడు. సుపారీ తీసుకున్న వ్యక్తి రామకృష్ణను ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News