పాదయాత్రలో అపశృతి.. షర్మిల టీం పై తేనెటీగల దాడి
రాజన్న పాలనను తీసుకురావాలన్న లక్ష్యంతోనే ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేపట్టారు. తెలంగాణలో షర్మిల చేస్తున్న పాదయాత్రకు..
భువనగిరి : తెలంగాణలో రాజన్న పాలనను మళ్లీ తీసుకొస్తానంటూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పార్టీని స్థాపించారు. రాజన్న పాలనను తీసుకురావాలన్న లక్ష్యంతోనే ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేపట్టారు. తెలంగాణలో షర్మిల చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. యాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరినీ ఆమె ఆత్మీయంగా పలకరిస్తూ.. టీఆర్ఎస్ ను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం షర్మిల యాదాద్రి భువనగిరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో ఊహించని ఘటన జరిగింది. మోట కొండూరు మండలం నుంచి ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద ఒక చెట్టు కింద గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతుండగా.. తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆమెను సురక్షితంగా కాపాడారు. ఈ తేనెటీగల దాడిలో పలువురు వైఎస్సార్టీపీ కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు.