వైన్ షాపు టెండర్లకు అనూహ్య స్పందన.. ఇప్పటికే 6,913 దరఖాస్తులు
తెలంగాణలో వైన్ షాపు టెండర్లకు అనూహ్య స్పందన వస్తోంది.
తెలంగాణలో వైన్ షాపు టెండర్లకు అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,913 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 1400 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. గురువారం నాడు ఏకంగా 3,140 దరఖాస్తులు రావడం గమనార్హం. గడువు తేదీ సమీపిస్తుండటంతో ఆశావహులు పోటీపడి దరఖాస్తులు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ. ఈ నెల 21న డ్రా పద్ధతిలో వైన్ షాపులను కేటాయిస్తారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వైన్ షాపులకు కొత్త లైసెన్సుల కోసం ప్రభుత్వం మూడు నెలల ముందుగానే టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.